TPT: నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతుల 0.85 సెంట్ల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా జారీ చేశారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశాలతో తహసీల్దార్ బాధితుల ఇంటికే వెళ్లి పట్టా అందజేశారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యకు దీంతో పరిష్కారం లభించింది.