PPM: వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ డీడీ టి.భవాని శంకరరావు తెలిపారు. ఇటువంటి పరిస్థితిల్లో జిల్లాలోని రైతాంగమంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో వాతావరణ మార్పులపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు.