VZM: రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తవలసలో నిలిచిపోయిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.