TG: భూముల విలువలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన భూముల విలువలు జూన్ 5 నుంచి అమలులోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని తెలిపారు. భూముల మార్కెట్ విలువ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని వెల్లడించారు.