AKP: ఖేత్ బచావో అభియాన్-2026 కార్యక్రమంలో భాగంగా నాతవరంలో మండల వ్యవసాయ అధికారి జీ.సుగుణ, ఆర్ఎస్కే సిబ్బంది బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని రైతులకు సూచించారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులు, పచ్చిరొట్ట, జీవ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు.