BPT: అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక PGRS నిర్వహిస్తున్నట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. మండల పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.