JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరులోని గోపి చెరువులో అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బర్డ్ వాచ్ కార్యక్రమం నిర్వహించారు. వలస పక్షుల ప్రాధాన్యం, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సహజ వ్యవసాయం, భూసార పరీక్షలు, వాననీటి సంరక్షణ, సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు పలు సూచనలు చేశారు.