BDK: ములకలపల్లి మండలం, జగన్నాధపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షఫీ ఇవాళ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం వారి గ్రామానికి చేరుకుని షఫీ బౌద్ధకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.