‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇచ్చినందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రులకు సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా గురువారం విడుదలవుతుండగా, ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్లు షురూ కానున్నాయి.