BHNG: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలడుగు వద్ద జాతీయ రహదారిపై రైతులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు బుధవారం సామూహిక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పేరుకుపోయినప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.