VSP: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ‘ఢీ’ పండు మాస్టర్‌కు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అండగా నిలిచారు. ఆనందపురం వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట్ వివరించగా.. పల్లా స్పందించారు. వైద్యులతో మాట్లాడి, చికిత్స ఖర్చుల విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.