అన్నమయ్య: చిట్వేల్ మండల ఎంఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల వంట ఏజెన్సీలకు కుక్ కమ్ హెల్పర్లపై శిక్షణ నిర్వహించారు. ఎంఈఓలు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా, నాణ్యతతో అందించాలని సూచించారు. ఉత్తమ వంటలకు బహుమతులు అందజేసి, కిచెన్ గార్డెన్పై అవగాహన కల్పించారు.