ATP: రైతులకు పత్తి, వేరుశనగ విత్తనాలు 90 శాతం సబ్సిడీతో సకాలంలో ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి వెంకటరాముడు యాదవ్ పేర్కొన్నారు. బుధవారం పెద్దవడుగురు మండలంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సేవా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, ఎకరాకు మూడు బస్తాల చొప్పున రైతులకు వేరుశనగ అందించాలన్నారు.