E.G: కొవ్వూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన MPDO తోటా భక్త వెంకట రమణ పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సేవలో అంకితభావంతో పనిచేసి గ్రామీణాభివృద్ధికి విశేష సేవలందించారని ఎమ్మెల్యే కొనియాడారు. అలాగే శేష జీవితాన్నికుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.