మహిళల T20 ప్రపంచ కప్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జూన్ 14న తలపడనుంది. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. కేవలం IND-PAK మ్యాచ్కు మాత్రమే కాకుండా, టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురావాలని కోరింది. కాగా, భారత్తో పాటు గ్రూప్-Aలో AUS, PAK, SA, BAN, నెదర్లాండ్స్ ఉన్నాయి.