SDPT: అక్కన్నపేట మండలం పంతుల్ తండా గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సబిహా వరి కొయ్యలు కాల్చవద్దని సూచించారు. కొయ్యలు కాల్చడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని ఆమె తెలిపారు. పంట అవశేషాలను భూమిలో కలియదున్ని వేస్ట్ డీకంపోజర్స్ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వినియోగించాలని సూచించారు.