TPT: శ్రీకాళహస్తిలో వైసీపీ ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో పోస్టర్, బుక్లెట్ను మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన ఆయన, ప్రజా సమస్యలపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.