BPT: ఇసుకపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను టీడీపీ నేత అనగాని శివప్రసాద్ పరిశీలించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కేటాయించిన రూ.40 లక్షల సీఎజీఎఫ్ నిధులతో, భూమిపూజ జరిగిన 90 రోజుల్లోనే ఈ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 27 నుంచి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి నూతన వసతులను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.