AP: పోలవరం జిల్లా దేవీపట్నం అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులిని బందించేందుకు 19 రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 7 బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ఇవాళ ఉదయం గంగంపాలెం పరిసరాల్లో పులి సంచరించి 12 ఆవు దూడలు, ఒక గేదెను చంపినట్లు అధికారులు గుర్తించారు. మృతి చెందిన పశువులకు పరిహారం అందిస్తామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.