PLD: అచ్చంపేట ఆర్ అండ్ బీ బంగ్లాలో బుధవారం టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ల, బూత్ కన్వీనర్ల కీలక సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి, తప్పు ఒప్పులను సవరించాలని తీర్మానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఓటర్ల సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు వివరించారు.