AP: గత ఏడాది యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి.. ప్రపంచం AP వైపు చూసేలా చేశామని CM చంద్రబాబు అన్నారు. యోగాతో అనేక రికార్డులు సాధించామని, 2 కోట్ల 44 లక్షల మంది ఈ కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకుంటే కోటి 91 లక్షల మందికి సర్టిఫికెట్లు అందించామన్నారు. లక్షా 53 వేల మంది శిక్షకులతో గత ఏడాది ‘యోగాంధ్ర’ను నిర్వహించామని, ఇప్పుడు మరింత ఘనంగా ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు.