AKP: రాంబిల్లి మండలంలో వరహానది గట్లును పటిష్టం చేయడానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సీఎంను అమరావతిలో కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గట్లు బలహీనంగా ఉండడంతో వర్షాలు పడితే గండ్లు పడి పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. పంటలు దెబ్బతింటున్నాయన్నారు.