కోనసీమ: అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వంద శాతం పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించారు.