KMR: సదాశివనగర్ మండలం మోడేగాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆషిక్ సాంగ్వన్ బుధవారం పరిశీలించారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.