BPT: కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం గ్రామ చెరువును ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించారు. చెరువు పరిస్థితి, నీటి నిల్వలు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.