WNP: రాబోయే విద్యా సంవత్సరంలో జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పదో తరగతి ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక బోధన అంశంపై సమావేశం నిర్వహించారు.