బాపట్ల జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా మువ్వల వెంకటరమణ బుధవారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కొండముది బంగారు బాబు ఆయనకు బాధ్యతలు అప్పగించి అభినందనలు తెలిపారు. గతంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. ఆయనకు జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.