AP: HYDలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదని CM చంద్రబాబు అన్నారు. ప్రజలకు మేలు చేయడంలో నాయకులు పోటీ పడాలి తప్ప, విభేదాలు తెచ్చేందుకు కాదని హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిందని, ప్రజలకు ఎవరు మేలు చేశారనేది అందరికీ తెలుసన్నారు. ‘అభివృద్ధిని లాజికల్‌గా తీసుకెళ్లాలి, అనవసర వివాదాలు సృష్టించడం మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు’ అన్నారు.