ATP: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్లను ఇవాళ కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. జూన్ 4, 5 తేదీల్లో విద్యార్థులకు పోటీలు, జూన్ 5న అవగాహన ర్యాలీ, ఈ-సైక్లింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ.మలోల, ఈఈ శశికళ పాల్గొన్నారు.