నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయి. గురువారం నాటికి ఇవి నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని, దీనికి అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.