విశాఖ జిల్లా ఆనందపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. పరీక్షల అనంతరం కాళ్లకు సర్జరీ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి 6 నెలల విశ్రాంతి అవసరమని చెప్పారు.