PDPL: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛ గావ్, సురక్ష జలవాయు కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. గ్రామాలలో వ్యర్ధాల నిర్వహణ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ నివారణ తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో లక్ష్యాలు సాధించాలని తెలిపారు.