ELR: జంగారెడ్డిగూడెం మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎస్సై వీరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక మసీద్ సెంటర్లో సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.