AP: ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల యోగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. యోగాంధ్ర 2026లో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలన్నారు. గత ఏడాది విశాఖ బీచ్ పక్కన రోడ్డుపై యోగా చేశామని.. ఈసారి కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగాంధ్ర-2026 నిర్వహిస్తామని, అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు.