NZB:హెచ్‌సీఏ బీ-డివిజన్ టీ-20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ 2026-27లో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. బుధవారం ఏకలవ్య-2 మైదానంలో జరిగిన ఆరో మ్యాచ్‌లో HYD బ్లూస్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో ఆడిన అన్ని 6 మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన జిల్లా జట్టు అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.