NGKL: విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా రేపు జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరించింది. ఈ మేరకు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శాంతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సొంత జిల్లాలోనే విద్యా రంగ సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.