ప్రకాశం: టంగుటూరు (మం) మర్లపాడులో పేకాట ఆడుతున్న నలుగురును ఎస్సై నాగమల్లేశ్వరరావు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,360 స్వాధీనం చేస్తున్నట్టు తెలిపారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.