E.G: రాజమహేంద్రవరం 49వ డివిజన్ సింహాచలం నగర్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదానికి గురైన కుటుంబాన్ని పరామర్శించి భవాని చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.