రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ వివాదం కొలిక్కి వచ్చింది. ఆయనపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు FWICE ప్రకటించింది. రణ్వీర్ లీగల్ నోటీసులు పంపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో ఎవరిపైనా నిషేధం విధించే హక్కు తమకు లేదని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా FWICE సూచించింది.