RR: మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని రామంతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాగులను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, సేవా కార్యక్రమాల నిర్వహణను అభినందించారు.