భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆమె బరిలోకి దిగడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 368వ మ్యాచ్ పూర్తి చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళ క్రికెటర్‌గా సుజీ బేట్స్(367) రికార్డును హర్మన్ బ్రేక్ చేసింది.