W.G: జనాభా గణన-2027లో భాగంగా గృహ గణన నమోదు ప్రక్రియను రాబోయే రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ఒక్క ఇల్లు కూడా నమోదుకు మిగలకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అపార్ట్మెంట్లు, వలస కార్మికులు ఉండే ప్రాంతాలను పర్యవేక్షించాలన్నారు.