BPT: పిట్టలవానిపాలెం (మం) చందోలులోని శ్రీ భగలాముఖి అమ్మవారిని ప్రముఖ సినీ గాయకుడు మనో దంపతులు బుధవారం సందర్శించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంతో మహిమ కలిగిన బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా మనో తెలిపారు.