కడప శంకరాపురంలోని ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలో బుధవారం బడి పండగ కార్యక్రమం జరిగింది. అంధ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని అంధ బాలబాలికలను తమ పాఠశాలలో చేర్పించాలని HM మురళి కోరారు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు, రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.