AP: YCP అధినేత జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన బినామీల నెట్వర్క్ బయటకు రావడంతో ఆయనకు భయం పట్టుకుందని మంత్రి సవిత విమర్శించారు. ఇప్పటికే ఉన్న సీబీఐ, ఈడీ కేసులతో పాటు కొత్తవి మెడకు చుట్టుకోవడంతో ఆయన వణికిపోతున్నారని అన్నారు. తన అక్రమాలు, కుట్రలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే DSCలో అవినీతి అంటూ జగన్ కొత్త డ్రామాలకు తెరతీశారని ఆరోపించారు.