సత్యసాయి: పుట్టపర్తిలోని స్థానిక ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ ఛైర్మన్ జవహర్, కమిటీ సభ్యులకు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఛైర్మన్, సభ్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందించారు. శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.