NRPT: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యంలో వన మహోత్సవం జరిగింది. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన యువత మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని, వాయు కాలుష్య నివారణకు ఇవి దోహదపడతాయని తెలిపారు.