AP: ఈ ఏడాది మే నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు టీటీడీ వెల్లడించింది. గత నెలలో మొత్తం 1.21 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తెలిపింది. 2024 మే నెలలో 1.01 కోట్లు, 2025 మే నెలలో 1.10 కోట్ల లడ్డూలను అమ్మినట్లు చెప్పింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేసినట్లు పేర్కొంది. నాణ్యతలో రాజీపడకుండా తయారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.