SRPT: సూర్యాపేట బస్టాండ్లో ఫ్యాన్లు తిరగకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ బస్టాండ్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, బస్టాండ్లోని అన్ని కంపార్ట్మెంట్లలో ఫ్యాన్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.