AKP: మహిళలు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హోం మంత్రి పగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం వివరాలను ‘X’ లో పోస్ట్ చేశారు. బాలల అక్రమ రవాణా జరక్కుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.